హైదరబాద్‌లో మరో భారీ మోసం.. ఫ్రీ లాంచ్ స్కీం తో వేల కోట్లు స్కాం..?

by Disha Web |
హైదరబాద్‌లో మరో భారీ మోసం.. ఫ్రీ లాంచ్ స్కీం తో వేల కోట్లు స్కాం..?
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర కేంద్రంగా మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ కస్టమర్ల నుంచి బిల్డర్లు కోట్లు కొల్లగొడుతున్నారు. భవిష్యత్‌లో కట్టే అపార్ట్ మెంట్లకు ఇప్పటి నుంచి లక్షల్లో నిర్వహకులు వసూళ్లు చేస్తున్నారు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్తో బిల్డర్ల మాయాజాలంలో పడి కస్టమర్లు లక్షల్లో నష్టపోతున్నారు.

వన్ టైమ్ సెటిల్మెంట్ చేస్తే 50 శాతం రాయితీ అంటు.. డబ్బులు కట్టించుకుంటున్నారు బిల్డర్లు. దీంతో డబ్బు చేతికి వచ్చాక బిల్డార్లు చేతులెత్తేస్తున్నారు. దీనికి సంబంధించి నగరం నలుమూలల ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ చేసిన పరిశోధనలో ఈ విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. ఇప్పటికైన కస్టమర్లు ఇలాంటి ఆఫర్లకు మోసపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story