ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ హ‌ఠాన్మర‌ణం

by Disha Web Desk |
ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ హ‌ఠాన్మర‌ణం
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ :సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ (55) గుండెపోటుతో మృతి చెందారు.స్వగ్రామం పరకాలలో ప‌ర‌కాల క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జ‌రుగుతున్న క్రికెట్ పోటీల‌కు ఆదివారం హాజ‌రైన ఆయ‌న ఓపెన‌ర్ బ్యాట్స్‌మెన్‌గా బ‌రిలోకి దిగారు. దాదాపు 12 ఓవ‌ర్ల పాటు బ్యాటింగ్ చేసిన శ్రీనివాస్ చాలా టైడ్ అయిపోయారు. ఈక్రమంలోనే తోటి మిత్రులు వారించ‌డంతో గ్రౌండ్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అనంత‌రం త‌న‌కు చాలా నీర‌సంగా ఉంద‌ని చెప్పి ఇంటికి బ‌య‌ల్దేరాడు. ఇంటికి చేరుకున్న కొద్దిసేప‌టికే ఆయ‌న గుండెనొప్పితో కుప్పకూలిపోయిన‌ట్లు కుటుంబ స‌భ్యులు వెల్లడించారు. ఆస్పత్రికి త‌ర‌లించగా ప‌రీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన‌ట్లుగా నిర్ధారించారు. వృత్తిరీత్య హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్న శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్‌గా ప‌నిచేస్తున్న శ్రీనివాస్ దాదాపు పాతికేళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొన‌సాగుతున్నారు.

మండ‌ల విలేక‌రి నుంచి స్టేట్ బ్యూరో చీఫ్‌గా..

1993జూలైలో భూపాల‌ప‌ల్లి కేంద్రంలో ప్రైవేట్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తునే ఈనాడు మండ‌ల విలేఖ‌రిగా ప‌నిచేశారు. దాదాపు రెండేళ్ల అనంత‌రం వార్త ప్రారంభంలోనే భూపాల‌ప‌ల్లి మండ‌ల విలేఖ‌రిగా జాయిన్ అయ్యారు.1992లో ఈనాడులో భూపాల‌ప‌ల్లి ప్రైవేటు స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తూ కంట్రిబ్యూట‌ర్‌గా ప‌నిచేశారు. 1994లో వార్త భూపాల‌ప‌ల్లి రిపోర్టర్‌గా ప‌నిచేశాడు.1998 వార్త జ‌గిత్యాల ఆర్‌సీ ఇన్చార్జిగా వెళ్లిపోయారు. 2000 సంవ‌త్సరంలో వార్త క‌రీంన‌గ‌ర్ బ్యూరోగా నియామ‌క‌మై మూడేళ్లు ప‌నిచేశారు. అక్కడి నుంచి గుంటూరు వార్త బ్యూరోగా వెళ్లారు. అక్కడ నాలుగేళ్లు ప‌నిచేసిన శ్రీనివాస్ అనంత‌రం స్వల్ప కాలం ఓ ప‌త్రిక‌లో డెస్క్‌లో కూడా ప‌నిచేశారు.

అనంత‌రం 2008లో ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోలో రిపోర్టర్‌గా జాయిన్ అయ్యారు. అందులోనే గ‌త ఆరేళ్లుగా ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్‌గా ప‌నిచేస్తూ వ‌స్తున్నారు. వృత్తిరీత్య ఎంతో చురుకుగా ఉండే శ్రీనివాస్ త‌న కెరీర్‌లో ఎన్నెన్నో సంచ‌ల‌నాత్మక‌మైన‌, విశ్లేష‌ణాత్మక‌మైన క‌థ‌నాలు రాశార‌ని ప‌ర‌కాల ప్రెస్‌ క్లబ్ పాత్రికేయులు, ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే వారు గుర్తు చేసుకుంటున్నారు. శ్రీనివాస్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు వారి ప్రగాడ సానుభూతిని తెలియ‌జేశారు. ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల 'దిశ' ఎడిటర్ డి.మార్కండేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Next Story

Most Viewed