కేసీఆర్ మునుగోడు సభలో ఊహించని పరిణామం...TRS Praja Deevena Sabha

by Disha Web Desk 4 |
కేసీఆర్ మునుగోడు సభలో ఊహించని పరిణామం...TRS Praja Deevena Sabha
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపఎన్నిక క్రమంలో మునుగోడులో టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రజా దీవెన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసగించారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన కేసీఆర్.. ఆ తర్వాత వేదికపై టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడిన కేసీఆర్.. పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ గా విరుచుకుపడ్డారు. రేపు మునుగోడులో అమిత్ షా సభ ఉన్న నేపథ్యంలో ఆయనకు కేసీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.

తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాపై అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక ఎందుకుని ప్రశ్నించారు. అయితే ప్రసంగం ముగిసిన తర్వాత కేసీఆర్ సభా వేదిక మీద నుంచి కిందకు వస్తున్న నేపథ్యంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సభా వేదికపై స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కేసీఆర్ ను కలిసేందుకు స్థానిక టీఆర్‌ఎస్ నేతలందరూ పోటీ పడ్డారు. ఈ క్రమంలో సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వేదిక పైనుంచి కింద పడిపోయింది. దీంతో కేసీఆర్ సమక్షంలోనే అమరవీరులకు అవమానం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అమరవీరుల స్థూపం కింద పడిపోతున్నా.. వేదికపై ఉన్న టీఆర్ఎస్ నేతలెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరవీరుల కుటుంబాలను టీఆర్ఎస్ నేతలు కించపరిచారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

ఏం పీక్కుంటావో పీక్కో.. ఈడీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Next Story

Most Viewed