అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు.. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు సమన్లు

by Disha Web Desk 12 |
అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు.. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు సమన్లు
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తీసేస్తామని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నట్లు ఓ మార్పింగ్ వీడియోను కాంగ్రెస్ కీలక నేతలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన బీజేపీ అధిష్టానం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేశారు. అలాగే మే1 విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు పోలీసులు సమన్లు జారీ చేశారు. అలాగే ఆమెకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో ఎడిటింగ్ గీతనే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు నోటీసులు జారీ చేశారు.

Next Story

Most Viewed