ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీని వాయిదా వేయాలని ఏఐఎస్ఎఫ్ వినతి

by Disha Web Desk 12 |
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీని వాయిదా వేయాలని ఏఐఎస్ఎఫ్ వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మే 1న తేదీన జరగబోయే ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్ష తేదీని వాయిదా వేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర బృందం మంగళవారం ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్, రెహమాన్ మాట్లాడుతూ.. 2023 సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా "మే 1 న" కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆ రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) అని, ఆ తేదీన నిర్వహించబోయే పరీక్షను మరొక తేదీకి మార్చాలని ఓపెన్ స్కూల్ డైరెక్టర్‌ను కోరారు. డైరెక్టర్ సానుకూలంగా స్పందించి పరిశీలన చేస్తామని తెలియజేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, రాష్ట్ర నాయకులు హరీష్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed