శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలను నిషేధించాలి.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ హెచ్చరిక

by Dishafeatures2 |
శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలను నిషేధించాలి.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలను నిషేధించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల పై ఒత్తిడి పెట్టవద్దని కోరుతూ సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి కార్పొరేట్ విద్యాసంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల వారినీ ఆహ్వానించి వారితో చర్చించడం సరికాదన్నారు.

శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలే ప్రధానంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమన్నారు. అ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. కానీ ఒక్క శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలపై కఠిన చర్యలు లేవన్నారు. ఇప్పటికీ వరకు ఆత్మహత్యలు చేసుకున్న అ కళాశాలల బ్రాంచిలను సీజ్ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ నీ నిర్వీర్యం చేసే విధంగా 50 మంది కంటే తక్కువగా ఉన్న హాస్టల్స్ నీ సమీపంలో ఉన్న హాస్టల్స్ లో విలీనం చేసే ఆలోచనను విరమించుకొవాలన్నారు.

పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెరగడానికి సంక్షేమ హాస్టల్స్ చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, హాస్టల్స్ అభివృద్ధికి వెంటనే ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed