- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఏసీబీ అధికారుల దూకుడు.. 100 రోజుల్లో 55 కి పైగా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగానలో ఏసీబీ అధికారులు తమ దూకుడును కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పై ప్రత్యేక నిఘా పెట్టిన ఏసీబీ.. అవీనితి అధికారుల పాలిట శాపంగా మారింది. గడిచిన 100 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో అవినీతికి పాల్పడుతన్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఈ కేసుల సంఖ్య 55 పైగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఏసీబీ అధికారుల దాడిలో పట్టుబడుతున్న వారిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికంగా ఉన్నారు. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ వారి వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి అంతమొందించేందుకు.. ప్రజలు సహకరించాలని.. ఎవరైనా లంచం అడిగిన తీసుకుంటున్నట్లు తెలిసిన 1064 అనే టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని.. దానికి ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో ఏసీబీ అధికాలు నిఘా పెంచడంతో ప్రతి నాలుగు రోజులకు కనీసం ఒక్క కేసు అయిన నమోదు అవుతున్నట్లు డాటా తెలుపుతుంది.