బెల్లంపల్లి లో గంజాయితో ఇద్దరి అరెస్ట్

by Kalyani |
బెల్లంపల్లి లో గంజాయితో ఇద్దరి అరెస్ట్
X

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో గంజాయితో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. 95 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన వివరాలు బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ టి శంకరయ్య కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి అశోక్ నగర్ మసీదు ఏరియా లో బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా ఇద్దరు వ్యక్తులు పోలీసును చూసి పారిపోతుండగా పట్టుకొన్నారు. నిందితులను తనిఖీ చేయగా 95 గ్రాముల గంజాయి లభించింది.

బెల్లంపల్లిలోని కాల్ టెక్స్ చెందిన షేక్ ముజ్జు సల్మాన్, బాబు క్యాంప్ కు చెందిన చిలుముల సాగర్ స్నేహితులతో కలిసి గంజాయి కి అలవాటు పడ్డారు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు గంజాయి అధిక ధరలకు అమ్మి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఇద్దరూ మహారాష్ట్ర బల్లర్షలో తక్కువ ధర కి గంజాయి కొనుగోలు చేసి బెల్లంపల్లిలో విక్రయిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని బెల్లంపల్లి తాహసీల్దార్ సుధాకర్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు.Next Story

Most Viewed