కంటి వెలుగు కష్టాలు..ఒప్పంద సిబ్బందికి వేతనాలు ఏవి..?

by Disha Web Desk 20 |
కంటి వెలుగు కష్టాలు..ఒప్పంద సిబ్బందికి వేతనాలు ఏవి..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో అత్యంత కీలకమైన సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వేతనాలు అందినట్లు తెలుస్తుండగా మరికొన్ని చోట్లజీతాలు రాక సిబ్బంది వెతలు పడుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో అత్యంత కీలకమైన ఆప్తోమెట్రీషియన్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇంకా వేతనాలు అందలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది పొరుగున ఉన్న కామారెడ్డి కరీంనగర్ మరికొన్ని జిల్లాల్లో ఇప్పటికే కంటివెలుగు సిబ్బందికి జీతాలు ఖాతాల్లో జమైనట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేతనాలు లేవు...

కంటివెలుగు కార్యక్రమంలో పనిచేస్తున్న ఆప్తోమెట్రీషియన్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా వేతనాలు అందలేదు గ తేడాది డిసెంబర్ నెలలోనే వీరంతా విధుల్లో చేరారు. వీరికి హైదరాబాద్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ డీఎం అండ్ హెచ్ ఓ కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయాల్లో శిక్షణ ఇచ్చారు. ఆప్తో మెట్రీషన్లకు రూపాయలు 30,000 డేటాఎంట్రీ ఆపరేటర్లకు 19,000 ప్రతినెల వేతనంగా ఇచ్చేందుకు ఒప్పంద ప్రాతిపదికన నియామక పత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ కు చెందిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వీరికి వేతనాలు అందాల్సి ఉంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ట్రెజరీ ద్వారా వేతనాల చెల్లింపులకు చర్యలు తీసుకుంది ఇప్పటికే ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు తెలుస్తోంది కానీ సిబ్బందికి మాత్రం ఇంకా జీతాల చెల్లింపు జరగలేదు.

సిబ్బంది ఆందోళన...

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అనేక జిల్లాల్లో ఇప్పటికే వేతనాలు అందినట్లు తెలుస్తుండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం తమకు వేతనాలు అందకపోవడంపై ఆప్టోమెట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఆరు నెలల కోసం తమను ఒప్పంద ప్రాతిపదికన నియమించిన అధికారులు కనీసం ప్రతి నెల వెంట వెంటనే వేతనాలు ఇస్తే బాగుంటుందని వారు చెబుతున్నారు. తమ విధుల్లో చేరి అటు ఇటుగా రెండు నెలలు అవుతుందని ఇంతవరకు వేతనాల ఊసే లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సకాలంలో అధికారులు తమ వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తమకు వేతనాలు అందేలా చూడాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed