మహిళ మృతిపై బంధువుల ఆందోళన

by Aamani |
మహిళ మృతిపై బంధువుల ఆందోళన
X

దిశ,కాగజ్ నగర్ : వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబీకుల ఆందోళన చేశారు. ఈ ఘటన బుధవారం ఉదయం కాగజ్ నగర్ పట్టణం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘటన వెలుగు చూసింది. కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన బడికెల కృష్ణవేణి 28 సం. జ్వరంతో బాధపడుతూ పట్టణంలోని పెట్రోల్ బంక్ ఏరియా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేరింది. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందని బాధితులు తెలిపారు. కాగా మృతురాలి భర్త బుధవారం ఉదయం మాట్లాడుకుంటూ టిఫిన్ కోసమని బయటకు వెళ్లి వచ్చేసరికి మృతి చెందిందని దీంతో ఇప్పటి వరకు బాగానే ఉన్నా మహిళ మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి వైద్యుని పై బాధిత కుటుంబీకుల ఆగ్రహం వ్యక్తం చేసి వైద్యుని నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని మృతురాలి భర్త పర్వతాలు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చికిత్స అందించేందుకు వైద్యుడు డబ్బులు అడిగాడని డబ్బులు లేవని చెప్పడంతో మహిళకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో తన భార్య మృతి చెందినట్లు ఆరోపించారు. డబ్బులు లేవని చెప్పారు కదా అంటూ వైద్యుడు మృతురాలి కుటుంబీకులను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మాట్లాడినట్లు బాధితులు వాపోయారు. మహిళ మృతికి కారణమైన ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మాచారం తెలుసుకున్న రూరల్ సీఐ రాంబాబు ఆసుపత్రికి చేరుకొని ఘటన వివరాలు కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. మృతురాలికి కూతురు కావ్య శ్రీ( 7) కొడుకు శివతేజ (3) ఉన్నారు.Next Story

Most Viewed