ఎయిడెడ్ జీతాల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి..

by Disha Web Desk 20 |
ఎయిడెడ్ జీతాల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి..
X

దిశ, మంచిర్యాల టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం కెటాయించిన బడ్జెట్ ఉన్నప్పటికీ గతమూడు నెలలుగా ఎయిడెడ్ టీచర్లకు వేతనాలు ఇవ్వడంలేదు, సప్లిమెంటరీ వేతనాలు, సెలవు జీతాలు, టీఎస్జీఎల్ఐ, జీపీఎఫ్ క్లైములు, పీఆర్సీ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్, పెన్షన్ బకాయిలు తదితర బిల్లులన్నీ నెలల తరబడి మంజూరు కావటం లేదు అని జిల్లా యుఎస్పీసీ నాయకులు అన్నారు. బుధవారం స్థానిక మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ లో నిరసన తెలుపుతూ పదిరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న బకాయిలు మంజూరు చేసేటందుకు ఆర్థిక శాఖ చొరవ చూపటం లేదు.

ఎయిడెడ్ జీతాలు, పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయకుంటే మార్చి 24న జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసనప్రదర్శనలు నిర్వహిస్తామని, అప్పటికీ బిల్లుల మంజూరులో పురోగతి లేకుంటే మార్చి 28న హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించాలని రాష్ట్ర యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. 24న జరిగే నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో నిరసన, పోరాట కార్యక్రమాల్లో పాల్గొనాలని యుయస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుర్రాల రాజ వేణు, ఆసంపల్లి రమేష్, మోతె జయకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జాకీర్ హుస్సేన్, అప్పారావులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed