కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి..

by Disha Web Desk 20 |
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి..
X

దిశ, సారంగాపూర్ : ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అటవీ దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో సారంగాపూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, రైతు బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్యలక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోళ్ల మురళీధర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో సరోజ, ఏవో రాజశేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు అధికారులు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.



Next Story