మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం...

by Disha Web Desk 11 |
మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం...
X

దిశ, భైంసా : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించగా...ఈ సమావేశానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ యార్డ్ గురించి పలువురు పలు సమస్యలు విన్నవించగా...అన్ని సమస్యలు తీరే విధంగా చర్యలు తీసుకుంటానని, రైతుల సులువు కొరకు ముదోల్ కేంద్రంలో ఏ.ఎం.సి సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం రద్దీగా ఉన్న చోటు నుంచి మార్కెట్ యార్డ్ నీ తొందర్లోనే విశాలమైన ప్లేస్ కి మారుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, వైస్ చైర్మన్ జే.కే పటేల్, సంబంధిత అధికారులు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed