కాశ్మీర్ ఆఫ్ తెలంగాణ పూర్వ ఆదిలాబాద్ .. మంత్రి కేటీఆర్

by Disha Web Desk 20 |
కాశ్మీర్ ఆఫ్ తెలంగాణ పూర్వ ఆదిలాబాద్ .. మంత్రి కేటీఆర్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం ఆదిలాబాద్ లోని బీడీఎన్ టీ ల్యాబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలను విస్తరించాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధానం అని ఆయన అన్నారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఒక ఐటీ కంపెనీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్ టీటీ, బీడీఎన్ టీ ల్యాబ్ ను ఆదిలాబాద్ లో ఏర్పాటుచేసిన సంజయ్ దేశపాండే కు ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్దికి ఆమడదూరంలో ఉండేదని, కాని ఆదిలాబాద్ ను కూడా ఐటీ మ్యాప్ లో పెట్టిన సీఎం కేసీఆర్ విజన్ కు ధన్యవాదాలని అన్నారు.

సీఎం కేసీఆర్ దార్శనికతతో వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు విస్తరింపచేస్తామని ఆయన అన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు అవకాశాలు కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలతో పోటీ పడతారన్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో ఐటీ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. పట్టుదల ఉంటే ఎవరికీ తీసిపోకుండా విజయం సాధిస్తారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఎన్ టీటీ, బీడీఎన్ టీ ల్యాబ్ లో పనిచేస్తున్న వాళ్లంతా ఆదిలాబాద్ స్థానికులేనని, ఇక్కడ ఉండే వీళ్లంతా అమెరికాతో పాటు ఎన్నో దేశాల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.

విద్యుత్ సరాఫరాను మరింత మెరుగురిచేందుకు డెడికేటెడ్ ట్రాన్స్ ఫార్మర్ కావాలని, తాత్కాలిక బిల్డింగ్ ని ఆధునీకరించాలని ఉద్యోగులు కోరగా కేటీఆర్ స్పందించారు. కలెక్టర్, మున్సిపల్ ఛైర్మెన్ కి కోటిన్నర రూపాయలను సాయంత్రం వరకు మంజూరు చేయిస్తానని, ఆధునీకరణ పనులను ప్రభుత్వ పరంగా ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ కంపెనీ స్థాపించడమే ఈ యాజమాన్యం మనకు చేసిన అతి పెద్ద సహాయమని ఆయన అన్నారు. వీళ్లను చూసి మిగతా వారు రావాలన్నది ప్రభుత్వ ఆశ అన్నారు. గతంలో ఆదిలాబాద్ లో సీసీఐ ఉండేది, దాన్ని తిరిగి తెరిపించేందుకు చాలా ప్రయత్నాలు చేసినమన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఈ విషయం గురించి చర్చించామన్నారు. కొత్త యూనిట్ పెడితే ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారో అవన్నీ ఇస్తాం అని కూడా చెప్పామన్నారు.

రాష్ట్రంలో నిర్మాణ రంగం అద్భుతంగా పురోగమిస్తోందని, ప్రైవేటు కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయన్నారు. జోగురామన్ననాయకత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉధ్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ చేసిందని, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జోగురామన్న ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని అడిగారన్నారు. ఆయన విజ్ఞప్తిమేరకు ఐదు ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ కు త్వరలోనే శంఖుస్థాపన చేస్తామని తెలిపారు. విదేశాల్లో ఉన్న పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూమి పుత్రులు కూడా ముందుకు రావాలి. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తాము. ఇక్కడ ఏర్పాటుచేయబోతున్న ఐటీ పార్క్ లో కంపెనీలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

పూర్వ ఆదిలాబాద్ జిల్లా కశ్మీర్ ఆఫ్ తెలంగాణ అని పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఉన్నంత అందంగా తెలంగాణలో ఏ జిల్లా ఉండదన్నారు. గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని మైదానాలు జలపాతాలు, జోడేఘాట్, కుమ్రం భీం, అద్భుతమైన సాంస్కృతిక సంపద ఇక్కడ ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లకు మంచి టూరిజం డెస్టినేషన్ ఇది అని తెలిపారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని అందమైన ప్రదేశాలను ప్రమోట్ చెయ్యాలని టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదిలాబాద్ లో టూరిజం ప్రమోట్ చెయ్యాలి. హైదరాబాద్ నుంచి వీకెండ్ లో టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది. టూరిజం మినిస్టర్ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఎన్ టీటీ, బీడీఎన్ టీ ల్యాబ్ లో ఆధునీకరణ పనులకు ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కలెక్టర్ ఈ పనులను పూర్తి చేయ్యాలన్నారు.

Next Story

Most Viewed