భారీగా కురిసిన వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు

by Sumithra |
భారీగా కురిసిన వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు
X

దిశ, కుబీర్ : మండల కేంద్రంతో పాటు పలుగ్రామాల్లో శుక్రవారం వర్షం దంచికొట్టింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు అర్ధాంతరంగా ఇళ్లకు చేరుకున్నారు. సోయా పంట కోసిన రైతులు, పంటను ఆరబెట్టినవారు వారు ఆందోళనకు గురయ్యారు. వారంరోజులుగా వర్షాలు పడుతూనే ఉండడంతో చేతికి వచ్చిన పంట ఇళ్లల్లోకి తెచ్చుకోవడం కష్టంగామారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ముదిరిన పత్తికాయలు కుళ్ళి పోతున్నాయి. కొన్ని రోజులుగా ఉదయం నుంచే మబ్బులు పట్టి ఉంటుండడంతో పనులుచేయడానికి వెనకాడుతున్నారు.

Next Story

Most Viewed