సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు..

by Disha Web Desk 20 |
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు..
X

దిశ, దండేపల్లి : సాగునీటి కోసం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి లిఫ్ట్ ఆయకట్టు రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. లిఫ్ట్ కింద పంటలకు సాగు నీరందక పోవడంతో పంటలు ఎండి పోతున్నాయని ఆందోళనకు దిగారు. ముత్యంపేట గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గూడెం లిఫ్ట్ ద్వారా ఈ యాసంగి సీజన్ కి సాగు నిరందిస్తామని చెప్పడంతో పంటలు వేసుకున్నామని, సాగునీరు అందించక పోవడంతో పంటలు ఎండి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇక్కడికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకొని ఆందోళన విరింనింప జేసే ప్రయత్నం చేశారు. స్పష్టమైన ఆమె వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు బీస్మించుకుని కూర్చున్నారు. దీంతో స్థానిక తహసిల్దార్ హనుమంతరావు చివరకు మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో సెల్ ఫోన్లో రైతులతో మాట్లాడించారు. రాత్రి వార కల్లాలిఫ్టు మోటార్ల వద్ద ఏదేని లోపం ఉంటే సరి చేయించి సాగునీటిని అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.



Next Story

Most Viewed