రైతు ఐడియా అదుర్స్.. పంటను కాపాడుతున్న ఎలుగుబంటి!

by Anjali |
రైతు ఐడియా అదుర్స్.. పంటను కాపాడుతున్న ఎలుగుబంటి!
X

దిశ ఖానాపూర్: దిశ ఖానాపూర్: గత ఐదారేళ్లుగా చాలా జిల్లాల్లో అడవి పందులు, కోతుల బెడద ఎక్కువైపోయింది. ఇది రైతులకు ప్రధాన సమస్యగా మారింది. అడవుల్లో చెట్లు నరికివేతకు గురవడంతో అడవి జంతువులు, పక్షులకు ఆహారం దొరకడం లేదు. దీంతో జంతువులు తమ ఆకలి తీర్చుకోవడానికి రైతుల పంట పొలాలకు దారిపట్టాయి. ప్రతి ఏటా అడవి పందుల వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. కాగా పండించే పంటను అడవి పందుల భారం నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు చేసిన ఐడియాకు సోషల్ మీడియాలోని జనాలు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని తర్లపాడ్ గ్రామానికి చెందిన ఆకుల రాజేశ్వర్ అనే రైతు యొక్క పంట పొలంలో వేసిన పంటను అడవి పందులు, కోతుల భారం నుంచి పంటను కాపాడుకోవడం కోసం ఎలుగుబంటి ఫోటోతో బ్యానర్లు కొట్టించాడు. వాటిని పంట చేను చుట్టూ పెట్టాడు. దీంతో అడవి పందుల, కోతుల భారం తగ్గింది. ‘ఐడియా సూపర్’ అంటూ రైతులు అతడ్ని మెచ్చుకుంటున్నారు.

Advertisement

Next Story