రాజకీయ లబ్ధి కోసమే.. కవితక్క పై ఈడీ విచారణ..

by Disha Web Desk 20 |
రాజకీయ లబ్ధి కోసమే.. కవితక్క పై ఈడీ విచారణ..
X

దిశ, బెల్లంపల్లి : మహిళా కమిషన్ కోసం చట్టసభల్లో మహిళల రాజకీయ హక్కుల కోసం ఉద్యమిస్తున్న భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై ప్రధానమంత్రి మోడీ రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ, సీబీఐ సంస్థలను ఉసిగొలుపుతున్నాడని భారత జాగృతి రాష్ట్ర నాయకులు సిద్ధం శెట్టి సాజన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ ను చూసి భయపడుతున్న ప్రధానమంత్రి మోడీ విచారణ పేరిట ఎమ్మెల్సీ కవితక్కను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు.

మోడీ బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు, రాజకీయ లబ్ధి కోసం ఎంతటికైనా దిగజారుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ఈడీ, సీబీఐ విభాగాలను అస్త్రంగా చేసుకొని దేశంలో రాజకీయ సంక్షోభాలను సృష్టించాలని చూస్తున్నాడ అన్నారు. మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో 3000 విచారణలను చేపట్టిందన్నారు. ఇందులో 90 శాతం ఫేక్ అని అధికారులు తేల్చారని చెప్పారు. విచారణ పేరిట రాజకీయ దాడులు చేపిస్తూ లొంగదీసుకోవడం, బీజేపీలో చేరిపిన్చుకొనేందుకు నీచమైన విధానాలకు పాల్పడేది ఒక బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఎన్నికల ముందు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిసారి ప్రధానమంత్రి మోడీ ఇలాగే విచారణలు, బెదిరింపులతో లొంగదీసుకోవడం ఆయనకు ఆనవాయితన్నారు.

అదే నేపథ్యంలో లిక్కర్ స్కాం పేరట ఎమ్మెల్సీ కవితను విచారణ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సారధి సీఎం కేసీఆర్ కూతురైన తెలంగాణ ప్రజల ఉద్యమముద్దుబిడ్డ ఎమ్మెల్సీ కవిత అల్లరి చిల్లర, ఈడీ సీబీఐ విచారణలకు బెదిరింపులకు భయపడదని అన్నారు. తెలంగాణ సమాజం, మహిళ లోకం ఎమ్మెల్సీ కవితకు అండగా నిలిచిందన్నారు. తన పై వచ్చిన ఆరోపణను నిగ్గు తేల్చుకోవడానికి దర్యాప్తు బృందాల పిలుపు మేరకు ఎమ్మెల్సీ కవిత బాధ్యతయుతంగా విచారణకు వెళ్లారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఒక మహిళ అనే కనీస గౌరవం లేకుండా కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ మహిళలోకం ఛీ కొడుతుందన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే బీజేపీ నాయకులను తెలంగాణలో తిరగనీయమని, తరిమికొడతామని హెచ్చరించారు. బీజేపీ నాయకుల అల్లరి చిల్లర మాటలు, బెదిరింపులు తెలంగాణ గడ్డ పై చెల్లవని స్పష్టం చేశారు. రాజకీయంగా గౌరవంగా విలువలతో కూడిన విమర్శలు చేయాలని హితవు పలికారు. అగౌరపరిచే విధంగా మాట్లాడితే నాలిక చీరేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాగృతి నాయకులు రాకేష్, శ్రీనాథ్, శ్రవణ్, మౌనిక్, శ్రీనివాస్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed