రేపు ఉట్నూర్ కు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక

by Sridhar Babu |
రేపు ఉట్నూర్ కు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు రానున్నారు. ఉట్నూర్ లోని కేవీ కాంప్లెక్స్ లో గురువారం నిర్వహించే రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వర్క్ షాప్ లో పాల్గొని రైతు భరోసా కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,

రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, మీటింగ్ హాల్ లను స్థానిక శాసన సభ్యులు వెడ్మ బొజ్జు తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకం పై అభిప్రాయాల సేకరణకు అదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన

వర్క్ షాప్ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలిపారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్ రావు, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, డీఎస్పీ నాగేందర్, ఆర్డీవో జీవాకార్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed