బీఆర్ఎస్ లో చేరిన యాదవ సంఘం అధ్యక్షుడు

by Sumithra |
బీఆర్ఎస్ లో చేరిన యాదవ సంఘం అధ్యక్షుడు
X

దిశ, దండేపల్లి : దండేపల్లి మండలం గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రంగంపల్లికి చెందిన మండల యాదవ సంఘం అధ్యక్షుడు అల్లంల సదానందం సోమవారం బీఆర్ఎస్ లో చేరారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై కులసంఘాల నాయకులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు.

అంతకు ముందుగా వెల్గనూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతున్నాయా లేదా ఆరా తీశారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామంలో పలువురు యువకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు మోటపలుకుల గురువయ్య, చుంచు శ్రీనివాస్, బండారి మల్లేష్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed