పర్మిషన్లు ఇచ్చారు.. రక్షణను మరిచారు

by Disha Web Desk 20 |
పర్మిషన్లు ఇచ్చారు.. రక్షణను మరిచారు
X

దిశ, రామకృష్ణాపూర్ : దీపావళి టపాకాయల వ్యాపారానికి పురపాలకసంఘం‌, పోలీసులు‌, ప్రధానంగా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతులు తప్పనసరి. కానీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్నారా అని ప్రజల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ప్రజల రక్షణను గాలికొదిలేసి, ప్రమాదకర స్థలంలో పర్మిషన్లు ఇచ్చేందుకు చకచకా ఆర్డర్లు అందించడంలో రాకెట్‌ బాంబుల్లా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

పట్టణంలోని స్థానిక సింగరేణి సూపర్ బజార్ ను అనుకొని ఇండియన్ గ్యాస్ గోదాం, రెండు పక్కల జనావాసాలు, పలు వ్యాపార సముదాయాలు ఉండగా గోదాం ముందే టపాకాయల వ్యాపారలతో ప్రమాదం పొంచిఉంది. సింగరేణి, పురపాలక అధికారులు మాత్రం కేవలం మూడు రోజుల వ్యాపారమే కదా అని ప్రజల రక్షణను పటాకుల మంటల్లో పడేసి ఏకపక్షంగా అనుమతులు ఇస్తున్నారనే అభియోగాలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత ఫైర్‌ డిపార్ట్‌మెంట్ అధికారులు‌ గణగణ గంటలు మోగించుకుంటూ వచ్చి నీళ్లు చల్లి చేతులు తుడుచుకోవచ్చనే భావనను వదిలేసి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలసిన అవసరం ఉందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed