ఎమ్మెల్యే సుమన్ నువ్వు అవమానించినోళ్లే కాంగ్రెస్ ను గెలిపిస్తారు

by Sumithra |
ఎమ్మెల్యే సుమన్ నువ్వు అవమానించినోళ్లే కాంగ్రెస్ ను గెలిపిస్తారు
X

దిశ, ముందమర్రి : చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ నువ్వు అవమానించిన వ్యక్తులే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజా రమేష్ బాబు జోష్యం చెప్పారు. సోమవారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆధార అభిమానాలు కురిపిస్తున్న నేపథ్యంలో మా అభ్యర్థులపై అవాకులు చెవాకులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పై దుష్ప్రచాలు చేస్తున్నాడని మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాల క్రితం నుండి సింగరేణి కార్మికులను, అధికారులను, నాయకులను రాష్ట్ర విప్ బాల్క సుమన్ అవమానించడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. ఓ సుమన్ నువ్వు అవమానించిన వ్యక్తులే నిన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ఆదివారం తుక్కు గూడ బహిరంగ సభకు హాజరై సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు కార్గే ఇచ్చిన ఆరు హామీలను తప్పకుండా నెరవేస్తామని హామీ ఇచ్చారు. సుమన్ అరాచక పాలనను అంతం చేసేందుకు తాను ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వచ్చానని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే బాల్కసుమన్ ను ఓడించేందుకు నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిధులను సొంతానికి మళ్లించుకుంటు సొంతానికి వాడుకుంటున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు గోపతి రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాసరెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు గోపతి బానెష్, మాజీ ఐ.ఎన్.టి.యు.సి. ఉపాధ్యక్షులు చంద్రగిరి ఎల్లయ్య, సీనియర్ నాయకులు లింగన్న, రవీందర్, లాజర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పొన్నం హరీష్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed