జేఈఈ మెయిన్స్ లో సత్తాచాటిన సీఓఈ బెల్లంపల్లి విద్యార్ధులు

by Disha Web Desk 1 |
జేఈఈ మెయిన్స్ లో సత్తాచాటిన సీఓఈ బెల్లంపల్లి విద్యార్ధులు
X

దిశ, బెల్లంపల్లి : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సీఓఈ బెల్లంపల్లి విద్యార్ధులు సత్తా చాటారు. 32 మంది పరీక్ష రాయగా 18 మంది విద్యార్ధులు ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో సిలివేరు వినయ్ 81.37 శాతంతో కళాశాల టాపర్ గా నిలువగా, తేజావత్ సిద్ధు ఎస్టీ విభాగంలో 7008 జాతీయ స్థాయి ర్యాంకుతో మొదటి స్థానంలో నిలిచాడు.

అదేవిధంగా ముంజం అంజన్న(74.98), ఎనగందుల మౌర్య (74.47), వైరాగడె రాహుల్ కుమార్ (74.30)చునార్కర్ అఖిలేశ్వర్ (71.31), తేజావత్ సిద్దు(69.35) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించి తరువాతి స్థానాల్లో నిలిచారన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో పి.విశాల్ (ఎస్టీ)1109 ర్యాకు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో సగానికి పైగా అడ్వాన్స్డ్ కు అర్హత పొందడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల రీజినల్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూపరాణి, ప్రిన్సిపాల్ అయినాల సైదులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్-2023 రెండో సెషన్ జరిగింది. ఈ పరీక్షలో కటాఫ్ పర్సంటేజీతో అడ్వాన్స్డ్ కు అర్హత సాధించిన వారికి జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో అడ్మీషన్స్ ఇస్తారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు విద్యార్ధులను పుష్పగుచ్ఛాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగినేని శ్రీరామవర్మ, మిట్టా రమేష్, చందా లక్ష్మీనారాయణ, సుంకరి అర్జున్, కట్ల రవీందర్, సురేష్ గౌడ్, సిబ్బంది సమేందర్, తేజశ్వి, రాజశేఖర్, ఐ.మల్లేష్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed