కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిన మంచిర్యాల, చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థులు

by Disha Web Desk 20 |
కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిన మంచిర్యాల, చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థులు
X

దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల, చెన్నూర్ , నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బాల్కసుమన్ లు కౌంటింగ్ కేంద్రం నుండి బయటికి వెళ్ళిపోయారు. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ కు మెజారిటీ రావడం, మంచిర్యాల నియోజక వర్గంలో బీజేపీ రెండవ స్థానంలో నిలుస్తుండడంతో, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు ఓటమిని తట్టుకోలేక కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది. అదే విధంగా పలుసార్లు గెలుపు పై ధీమాతో ఉన్న చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక్కసారి చెన్నూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ జోష్ కొనసాగుతుండడంతో నాయకులతో కలిసి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్ళారు.Next Story