మళ్లీ ఆ పార్టీలోకే వెళ్తా.. ఘర్ వాపసీపై రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
మళ్లీ ఆ పార్టీలోకే వెళ్తా.. ఘర్ వాపసీపై రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విడుదల చేసిన అభ్యర్థుల లిస్టులో ఆమె పేరు లేదు. దీంతో రేఖానాయక్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే స్వయంగా రేఖా నాయక్‌నే తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కచ్చితంగా చేరతానని స్పష్టం చేశారు. అయితే తన ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసే వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ నుంచే తాను వచ్చానని.. మళ్లీ అక్కడికే వెళ్తానని పేర్కొన్నారు. పన్నెండు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న తనను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రజా సేవ చేయాలంటే ఏదో ఒక రాజకీయ వేదిక కావాలని రేఖానాయక్ తెలిపారు.

కాగా రేఖానాయక్ భర్త జాన్సన్ నాయక్‌కు సీఎం కేసీఆర్ ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. అయితే బీఆర్ఎస్‌కు గుబ్ బై చెబుతూ రేవంత్ రెడ్డి సమక్షంలో జాన్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అటు ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రేఖా నాయక్ దరఖాస్తు చేశారు. అయితే ఆమెను ఆదిలాబాద్ ఎంపీ, ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖానాపూర్ కోసమే రేఖానాయక్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఖానాపూర్ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్‌లోకి వస్తానని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలకు రేఖా నాయక్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేఖానాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed