రక్తదానం చేసి ప్రాణదాతలు కండి..

by Disha Web Desk 20 |
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి..
X

దిశ, జన్నారం : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మదుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలలో రెడ్ క్రాస్ సోసైటి ఆద్వర్యంలో తలసేమియా బాధితులని ఆదుకునేందుకు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ తలసేమియా బాదితులకు రక్తం చాల అవసరం అని వారికి రక్త దానం చేసిన తలసేమియ బాదితులను కపాడినవారవుతారని అన్నారు. ఆపదలో ఉన్నవారిని రక్తదానం చేసి కాపాడవచ్చని ఆయన అన్నారు.

తలసేమియా వ్యాధిగ్రస్తులకు 15 రోజులకు ఒకసారి రక్తమార్పిడి అవసరం ఉంటుందని కావున దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేస్తే మరొకరి ప్రాణాలను కాపాడిన వారిని అవుతామని, రక్త దానం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్డీవో దాసరి వేణు తహాసిల్దార్ కిషన్, గిర్డవర్ భానుచందర్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్, ఎంపీడీవో అరుణా రాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed