డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నిరసన..ఖానాపూర్ పట్టణంలో బంద్..

by Disha Web Desk 20 |
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నిరసన..ఖానాపూర్ పట్టణంలో బంద్..
X

దిశ, ఖానాపూర్ : డబ్బులు బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కోసం ఖానాపూర్ పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో పట్టణంలోని ఏఎంకే పంక్షన్ హల్ లో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు పర్యవేక్షణలో ఇండ్ల పంపిణీ లాటరీ పద్దతిలో నిర్వహించారు. దీంతో కొంతమంది లబ్దిదారులు అర్హులైన వారికి ఇండ్ల పంపిణీ జరగలేదని అందలోనకు దిగారు. ఎన్నోరోజుల పోరాటాలతో సొంత గూడు దక్కుతుందని, ఆశ నేరవేరుతుందని అనుకున్నాం కానీ నిరాశ మిగిలిందని లబ్ధిదారులు ఆందోళనలు చేపట్టారు. వారికి మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఎంఎల్, పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఖానాపూర్ పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన, ఇండ్లు లేని నీరు పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందలేదని, అనర్హులకు ఇచ్చారని వారు నిరసన చేపట్టారు. అనర్హులకు అందిన డబుల్ ఇండ్ల పంపిణీ రద్దు చేస్తూ అర్హులైన వారికి ఇండ్ల జరిపించాలని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజుర సత్యం, దోనికేని దయనంద్, షబ్బీర్ పాషా, నాయిని శంతోష్, జక్కుల గంగమణి, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

మళ్ళీ సర్వేలు చేస్తాం..ఎమ్మెల్యే రేఖా నాయక్

ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉదేశ్యం అని ఎమ్మెల్యే రేఖశ్యాం నాయక్ అన్నారు. ఆందుకు ఖానాపూర్ పట్టణంలో 400 డబుల్ బెడ్ రూములు నిర్మించామని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరిగింది కానీ అర్హులైన వారికి అందేలా మళ్ళీ సర్వే చేపిస్తామని తెలిపారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, అవసరమైతే ఇంకా 200 ల పక్కా ఇండ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు.

Next Story

Most Viewed