ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడుదాం: బాలరాజు

by Dishanational1 |
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడుదాం: బాలరాజు
X

దిశ, మంచిర్యాల టౌన్: ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకానికి వ్యతిరేకంగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పని చేస్తుంది అని, 44 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్పొరేట్ సంస్థల ఎదుగుదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు అన్నారు. మతోన్మాద రాజకీయాలను పెంచి పోషిస్తూ దేశాన్ని అల్ల కల్లోలం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడే బీజేపీ ప్రభుత్వంలో ప్రశ్నార్థకంగా మారిందని, దానికి వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గం ఏకమై ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు.

సింగరేణి సుభిక్షంగా ఉండాలంటే సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలని, సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించిన చరిత్ర సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీదే అని, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసిన సంఘం ఏఐటీయూసీ అని వివరించారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఖలిందర్ అలి ఖాన్, మిట్టపల్లి పౌల్, నరసింగా రావు, సంపత్, సత్యనారాయణ, రాయమల్లు పాల్గొన్నారు.



Next Story