- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించిన నటి కృతి శెట్టి
సందడి చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులు
దిశ, మంచిర్యాల టౌన్ : ప్రజలకు అందుబాటులో సరసమైన ధరల్లో వస్త్రాలు అందించే ఉద్దేశంతో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ను ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి శనివారం ఘనంగా ప్రారంభించారు. షోరూం మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా తెలుగు రాష్ట్ర ల్లో ప్రారంభించిన ప్రతి చోట అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతో నెం.1 షాపింగ్ మాల్ గా చెన్నై షాపింగ్ మాల్ నిలిచిందన్నారు.
మంచిర్యాల ప్రజల అభిరుచికి తగట్లు వారికి సరిపడే వస్త్రాలు అందించి కస్టమర్ల అభిమానాన్ని పొందుతమని తెలిపారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన వస్త్రాలను, మోడ్రన్, ఫ్యాషన్ దుస్తులు అందించడంలో ముందుంటమని తెలియజేవారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్టులు అదిరే అభి, ఇమ్మాన్యుయేల్ తో కలిసి పలువురు సందడి చేశారు.
హీరోయిన్ కృతి శెట్టి, జబద్దస్త్ ఆర్టిస్టులకు చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో షాపింగ్ మాల్ ప్రాంతం కొక్కిరిసిపోయింది. ప్రారంభోత్సవానికి అతిథులుగా మంచిర్యాల ఎమ్మేల్యే నడిపెళ్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముకేష్ గౌడ్, కౌన్సిలర్లు ,తదితరులు పాల్గొన్నారు.