2024 సివిల్ సర్వీస్‌కు ఎన్నికైన ఆదిలాబాద్ జిల్లా వాసి

by Disha Web Desk 23 |
2024 సివిల్ సర్వీస్‌కు ఎన్నికైన ఆదిలాబాద్ జిల్లా వాసి
X

దిశ,ఆదిలాబాద్ : 2024 సంవత్సరం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీస్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా గ్రామానికి చెందిన ఆరే విశాల్ 718 ర్యాంక్ సాధించారు. విశాల్ తండ్రి ప్రస్తుతం జైపూర్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించడంతో బంధుమిత్రులు, చాందా గ్రామస్థులు, శ్రేయోభిలాషులు విశాల్ ను అభినందించారు.అయితే తన చిన్ననాటి కల నెరవేరినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. విశాల్ ఎందరో మంది యువతీ, యువకులకు మార్గదర్శకంగా నిలుస్తారని పలువురు పేర్కొంటున్నారు.


Next Story

Most Viewed