ఓఆర్ఆర్‌పై ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సెక్రటరీ రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 4 |
ఓఆర్ఆర్‌పై ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సెక్రటరీ రియాక్షన్ ఇదే..!
X

దిశ, సిటీ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డును నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం 2012లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఓఆర్ఆర్ టోల్ పాలసీ ప్రకారమే రూ. 7380 కోట్లకు గాను ఐఆర్ బీ ఇన్ఫ్రాస్టెక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ రూల్స్ ప్రకారమే అప్పగించామని రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన పురపాలక శాఖ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బిడ్లు

ప్రక్రియకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔటర్ ను 30 ఏళ్ల పాటు లీజుకు అప్పగించటంపై రకరకాలుగా అపోహాలు విన్పిస్తున్నాయని, ఈ బిడ్ల వ్యవహారంలో అక్రమాలుంటే నిరూపించవచ్చునని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ హైవ్అథారిటీ ఆఫ్ ఇండియా 2008 ప్రకారం బేస్ ప్రైస్ ను బహిర్గతం చేయరాదన్న నిబంధన ఉండటం, ఇంకా ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియ పూర్తి కానందున బయటకు చెప్పలేదని వివరించారు.

బిడ్ల ప్రక్రియ ఇలా...

గత సంవత్సరం నవంబర్ 9న ఇంటర్నేషనల్ కాంపిటేటీవ్ బిడ్ల నోటిఫికేషన్ ఇచ్చిన హెచ్ఎండీఏ బిడ్ల సమర్పణకు గత మార్చి నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించింది. బిడ్లను సిద్దం చేసుకునేందుకు ఏజెన్సీలకు రెండు దఫాలుగా ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించి, వాటి రూపకల్పనకు పలు సార్లు గడువు పెంచుతూ మొత్తం 142 రోజుల సమయం కూడా ఇవ్వగా, 11 సంస్థలు బిడ్లను సమర్పించినట్లు వెల్లడించారు. బిడ్లలో అందరి కన్నా ఎక్కువ బిడ్ ను కోడ్ చేసిన ఐఆర్ బీ సంస్థకు ఈ లీజు దక్కించుకున్నట్లు వివరించారు.

రూ. వందకు నేడున్న విలువ, 30 ఏళ్ల తర్వాత పెరిగే విలువను పరిగణలోకి తీసుకుని రూ. 7380 కోట్లుగా నిర్ణయించి ఐఆర్ బీకి అప్పగించినట్లు వెల్లడించారు. టీఓటీ ప్రాజెక్టుల ఇన్షియల్ ఎస్టిమేటెడ్ కన్సెషన్ వ్యాల్యూ విలువను మొత్తాన్ని నిర్థారించేందుకు కన్సెషన్ రుసుము, భవిష్యత్తులో సమకూరే ఆదాయ వనరులకు ప్రస్తుత నికర విలువ ఆధారంగా అంచనా వేసి , కన్సెషన్ కాలపరితితో మూలధన సాధారణ వ్యయాన్ని మినహాయించి లీజు మొత్తాన్ని లెక్కించినట్లు వివరించారు. ఔటర్, సర్వీస్ రోడ్స్ మాత్రమే ఐ ఆర్ బీ కి

లీజుకిచ్చినట్లు తెలిపారు. ప్రకటనలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వం వద్దనే ఉంటాయని వివరించారు. గ్రీనరి, ట్రామా సెంటర్స్, సైకిల్ ట్రాక్స్ హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంటాయని పేర్కొన్నారు. బిడ్డర్ తాను కోట్ చేసిన మొత్తాన్ని గడువు లోగా చెల్లించాలని, లేని పక్షంలో అది ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ లీజుపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఔటర్ రెవెన్యూ పెరిగిన కొద్దీ బిడ్డర్ కు ఇచ్చిన లీజు కాల పరిమితి తగ్గుతూ వస్తుందన్నారు. ఇదే పద్దతిన మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కూడా ఓ ప్రాజెక్టును పదేళ్ల కాంట్రాక్టు పరిమితితో అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాపైన వ్యక్తిగత దూషణలు చేసేవారికి నేనంటే చాలా అభిమానం ఉందేమో, కానీ వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని వ్యాఖ్యానించారు.

మరో మూడు ఇంటర్ ఛేంజ్‌లు

ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రస్తుతం 44 ఎంట్రీ, ఎగ్జీట్ పాయింట్లుండగా, మరో 22 ఇంటర్ ఛేంజేస్ పాయింట్లతో పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టుకు కనెక్టివిటీ కూడా ఉంది. ట్రాఫిక్ ను బట్టి మరో మూడు కొత్త ఇంటర్ చేంజ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు స్పెషల్ సీఎస్ వెల్లడించారు.

రెరా చైర్మన్ సీటుకు పోటాపోటీ

రెరా చైర్మన్ సీటు కోసం మొత్తం 37 మంది దరఖాస్తు చేసుకున్నారని అర్వింద్ కుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందులో ఆరుగురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులున్నారని, రెరా సభ్యత్వం కోసం మరో 59 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన వివరించారు.

Next Story

Most Viewed