స్టంట్ వేస్తున్నాడు అనుకున్నారు.. కానీ!

by GSrikanth |
స్టంట్ వేస్తున్నాడు అనుకున్నారు.. కానీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమ్మర్ కదా అని సరదాగా స్విమ్మింగ్‌కి వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌కు చెందిన అబ్దుల్ రజాక్, స్నేహితులతో కలిసి బుధవారం సాయంత్రం హయత్ నగర్‌లో బావిలో ఈతకు వెళ్లాడు. కొందరు స్నేహితులతో కలిసి రజాక్ సరదాగా ఈత కొడుతుండగా.. మరికొంత మంది స్నేహితులు బయట కూర్చుని ఫోటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటిదాకా అంతా బాగానే ఉన్నా.. స్నేహితులు చూస్తుండగానే ఈత కొడుతున్న రజాక్ బావిలో మునిగిపోయాడు.

స్నేహితులందరూ అతను స్టంట్ చేస్తున్నాడేమో.. నెమ్మదిగా బయటకు వస్తాడులే అని అనుకున్నారు. ఎంత సేపటికి రజాక్ బయటకు రావడంతో వెతకడం ప్రారంభించారు. ఈ ఘటన మొత్తం ఫోన్‌లో రికార్డయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్​ఎఫ్, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. రజాక్ కోసం నిన్నటి నుంచి గాలించగా.. ఇవాళ మధ్యాహ్నం మృతదేహం లభ్యమైంది. రజాక్ మృతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Next Story

Most Viewed