మంత్రి కేటీఆర్‌కు Thanks చెప్పిన వీఆర్ఏ ప్రతినిధులు బృందం

by Disha Web Desk 2 |
మంత్రి కేటీఆర్‌కు Thanks చెప్పిన వీఆర్ఏ ప్రతినిధులు బృందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గ‌త కొద్దిరోజులగా వీఆర్ఏలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పేస్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలంటూ తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు సమ్మెకు దిగారు. దీంతో, ఇటీవల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వీఆర్ఏలకు ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ముగిసిన అనంతరం పరిష్కరిస్తారమని మంత్రి కేటీఆర్ వీఆర్ఏలను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్, వీఆర్ఏలతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వీఆర్ఏల‌కు ఇచ్చిన హామీల అమ‌లుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నార‌ని స్పష్టం చేశారు.

త్వర‌లోనే వీఆర్ఏల స‌మ‌స్యకు ప‌రిష్కారం చూపుతామ‌ని అన్నారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాద‌ని తమ ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారంపై చ‌ర్చించేందుకు మీటింగ్ ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్‌కు వీఆర్ఏ ప్రతినిధులు ధ‌న్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని మంత్రిని కోరామ‌ని పేర్కొన్నారు. వీఆర్ఏల స‌మ‌స్య 25 వేల కుటుంబాల‌తో ముడిప‌డి ఉంద‌ని చెప్పారు.

Next Story

Most Viewed