కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్! : బండి సంజయ్

by Rajesh |
కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్! : బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయిందని కవిత చేసిన దొంగ సారా దందా కేసీఆర్‌కు నచ్చిన స్కీం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లిక్కర్ స్కామ్‌లో కవిత తెలంగాణ మహిళలు తల దించుకునేలా చేసిందని విమర్శించారు.

లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. బతుకమ్మ పేరుతో తెలంగాణ సంస్కృతిని కవిత దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, కృతిమ పూలు, డీజే పాటలతో బతుకమ్మ ఆడించి విలువ తీసేసిందని దుయ్యబట్టారు. బీజేపీలో మహిళలకు సముచిత స్థానం కలిపిస్తున్నామని, రాష్ట్ర కమిటీలో 30 శాతం మహిళలకు చోటు ఇచ్చామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

నరేంద్ర మోడీ ప్రధాని అయిన సంవత్సరమే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కానీ రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏం చేశారో ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్‌కు మహిళా కమిటీలే లేవని అసలు ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరు అని ప్రశ్నించారు. మహిళలకు ప్రభుత్వంలో పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ అన్నారు. వంట గదికే పరిమితమైన యాదమ్మ ప్రధానికి వంట చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు.

Read more:

కవితకు ఈడీ నోటీసులు.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే!

Next Story

Most Viewed