టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హోటల్‌పై కేసు నమోదు.. కారణమేంటంటే?

by Hamsa |
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హోటల్‌పై కేసు నమోదు.. కారణమేంటంటే?
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని హోటల్‌లో తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్స్‌ల్లో నాసీరకం ఆహార పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కేసులు కూడా నమోదు చేశారు. మహానగరంలోని హోటల్స్, హాస్టల్స్, ఫుడ్ సప్లై చేస్తున్న కిచెన్‌లు అపరిశుభ్రంగా ఉంచిన నిర్వాహకులకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పార్ట్‌నర్‌గా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అలాగే నాసిరకం పదార్ధాలను గుర్తించి హోటల్‌పై కేసు కూడా నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

సికింద్రాబాద్‌లోని వివాహ భోజనంబు హోటల్‌లో జూలై 8వ తేదీన తనిఖీ చేశారు. ‘‘చిట్టి ముత్యాలు బియ్యం (25 కిలోలు) 2022 నాటికి డేట్ అయిపోయిన బ్యాగ్ గుర్తించాము. అలాగే సింథటిక్ ఫుడ్ కలర్‌తో 500 గ్రాముల కొబ్బరి తురుము కనుగొనబడింది. స్టీల్ కంటైనర్‌లలో నిల్వ చేసిన ముడి ఆహార వస్తువులు & పాక్షికంగా తయారు చేసిన ఆహారాలు కవర్ చేయబడ్డాయి. కానీ సరిగ్గా లేబుల్ చేయబడలేదు. కొన్ని డస్ట్‌బిన్‌లు మూతలతో కప్పబడలేదు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. వంటగది ఆవరణలోని కాలువలలో మురికి నీరు ఉంది. ఆహార తయారీలో ఉపయోగించే నీరు కూడా పరిశుభ్రంగా లేనట్లు గమనించాము’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం అధికారులు పెట్టిన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఈ హోటల్ పార్ట్‌నర్ సందీప్ కిషన్ స్పందిస్తారా లేదా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.Next Story

Most Viewed