దేశానికే తలమానికంగా 125 అడుగుల భారీ విగ్రహం : మంత్రి కొప్పుల

by Disha Web Desk |
దేశానికే తలమానికంగా 125 అడుగుల భారీ విగ్రహం : మంత్రి కొప్పుల
X

దిశ తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌ బండ్‌ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్‌ విగ్రహ తెలంగాణ కే మాణిహరంగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పనులు 2023 ఫిబ్రవరి నాటికి పూర్తి అవుతాయాని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనులు త్వరితగతిన జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద11.5 ఎకరాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలోరూపు దిద్దు కుంటున్న 125 అడుగుల పొడవైన అంబేద్కర్ విగ్రహా నిర్మాణం పనులను సోమవారం నాడు అధికారులతో కలిసి మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్ది పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ అంటే ఎంతో గౌరవమని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దేశంలో అతి ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని, స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని 2016 ఏప్రిల్‌ 14న నిర్వహించిన జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జనరంజక పాలన కొనసాగిస్తున్నారని మంత్రులు చెప్పారు. నగరం నడిబొడ్డున నిర్మితమవుతున్న ఈ కట్టడాల గురించి సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణం చేస్తున్నామని వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతోపాటు ఆయన గొప్పతనం, జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తామన్నారు. సినిమా థియేటర్ కూడా ఉంటుందన్నారు. అంబేద్కర్ విగ్రహం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తమకు సలహాలు సూచనలు ఇస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి మాసంలో పనులు పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్‌లో అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.



Next Story

Most Viewed