ప్రాణం పోయినా అన్యాయం జరగనివ్వడు

by  |
ప్రాణం పోయినా అన్యాయం జరగనివ్వడు
X

దిశ,నిజామాబాద్: ప్రభుత్వ సూచన మేరకు నియంత్రిత పంటల సాగు చేస్తామని తీర్మానం చేసిన గ్రామాల రైతులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం కలగనివ్వరని అన్నారు. గురువారం వెల్పూర్ మండలం మోతే గ్రామంలో వానాకాలం సాగు ప్రణాళిక‌పై జరిగిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మోతే గ్రామంపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందన్నారు. అది ఉద్యమ సమయమైనా పాలనాపరంగానైనా మోతే గ్రామo కేసీఆర్ గుండెల్లో ఉంటుందన్నారు.

Next Story