‘ముస్లీంల సంక్షేమానికి తెలంగాణ రోల్ మోడల్’

by  |
‘ముస్లీంల సంక్షేమానికి తెలంగాణ రోల్ మోడల్’
X

దిశ, క్రైమ్ బ్యూరో: దేశవ్యాప్తంగా ముస్లీంల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలుస్తోందని జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ అతీఫ్ రషీద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారిక పర్యటనలో భాగంగా ఆయన శనివారం నగరానికి విచ్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శనివారం హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ రాష్ట్రంలో ముస్లీంలకు అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆరేండ్ల కాలంలో ముస్లిం మైనారిటీల కోసం సుమారు రూ.4945 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ముస్లింల పిల్లల కోసం 204 గురుకుల పాఠశాలలు, 83 జూనియర్ కాలేజీలను స్థాపించగా, వీటిలో 90 వేల మంది విద్యార్థులు ఉచిత విద్య అభ్యసిస్తున్నట్టు చెప్పారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరిట ముస్లింలకు రూ.207 కోట్లు కేటాయించారని అన్నారు.

పేద ముస్లీం బాలికల వివాహ సమస్యను పరిష్కరించడానికి షాదీ ముబారక్‌తో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా చేస్తూ, మొదటిసారిగా 66మంది ఉర్దూ అధికారులను నియమించారన్నారు. అనంతరం జాతీయ మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ రషీద్ మాట్లాడుతూ.. ముస్లింల కోసం ప్రారంభించిన విద్య, సంక్షేమ పథకాలు ఉన్నతంగా ఉన్నాయన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని కొనియాడారు.

Next Story

Most Viewed