క్లాసెస్ స్టార్ట్.. స్టూడెంట్స్ నిల్

by  |
Telangana online classes
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాఠశాలు ప్రారంభమైనప్పటికీ తొలి రోజు ఆన్ లైన్ తరగతులకు విద్యార్థులు హాజరుకాలేక పోయారు. ఆన్ లైన్ తరగతులకు సంబంధించిన షెడ్యూల్‌ను ముందస్తు‌గా విద్యార్థులకు తెలపకపోవడం‌తో విద్యార్థులు తరగతులకు హాజరు కాలేదు. తొలిరోజు విద్యార్థులతో ఫోన్ ద్వారా ఇంటరాక్షన్ అయినా ఉపాధ్యాయులు విద్యార్థుల వివరాలను సేకరించి రికార్డులలో పేర్లు నమోదు చేశారు.

పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ తొలిరోజు విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేక పోయారు దూరదర్శన్, టీ సాట్ ఛానల్స్ ద్వారా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏ సమయంలో ఏ తరగతుల వారికి క్లాస్‌లు నిర్వహిస్తారో తెలిపే షెడ్యూల్‌ని ముందస్తుగా విద్యార్థులకు అందించకలేకపోవడంతో విద్యార్థులు తరగతుల నిర్వహణ సమయం తెలియక తరగతులకు హాజరు కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దూరదర్శన్, టీ సాట్ ఛానల్స్ ద్వారా మొదటి రోజు బ్రిడ్జి కోర్సు పాఠాలను చెప్పారు. గత ఏడాది అంశాలను విద్యార్థులకు గుర్తు చేసేందుకు బ్రిడ్జి కోర్సు ద్వారా పాఠాలు బోధించారు.

విద్యార్థుల వివరాలు సేకరణ..

ఆన్ లైన్ తరగతులను నిర్వహించాల్సిన తొలిరోజు ఉపాధ్యాయులు విద్యార్థులకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను చేపట్టారు. పై తరగతులకు చేరుకున్న విద్యార్థుల పేర్లను రిజిస్టర్‌లో నమోదు చేశారు. ఫోన్ ద్వారా విద్యార్థులను సంప్రదించి ఈ ప్రక్రియ చేపట్టారు. జూన్ 25 నుంచి పాఠశాలకు హాజరవుతున్న ఉపాధ్యాయులు ముందస్తుగానే విద్యార్థుల వివరాలు సేకరించాల్సి ఉండగా ఆలస్యం చేసి తరగతుల ప్రారంభం రోజు వివరాలు చేపట్టారు. ఆన్ లైన్ తరగతులకు సంబంధించిన షెడ్యుల్ క్లాస్‌లు ప్రారంభం అయ్యాక విద్యార్థులకి తెలియజేసారు.



Next Story

Most Viewed