కేఆర్​ఎంబీకి తెలంగాణ లేఖ

by  |
కేఆర్​ఎంబీకి తెలంగాణ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ప్రవాహ సామ‌ర్థ్యాల‌లో అసమతుల్యతను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ఈ‌ఎన్‌సీ మురళిధర్ బుధ‌వారం లేఖ రాశారు. నాగార్జునసాగర్ కాలువల సామర్థ్యంలో అసమతుల్యత సవరించాలని విజ్ఞప్తి చేశారు. 1952 ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల ఒప్పందం ప్రకారమే ఉండాలని, కుడి, ఎడమ కాలువల సామర్థ్యాలు సమానంగా ఉండాలని పేర్కొన్నారు. రెండు కాలువల సామర్థ్యంలో తీవ్రమైన అసమానత ఉందని కేఆర్ఎంబీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

510 అడుగుల వద్ద ఎడమ కాలువ సామర్థ్యం 1,899 క్యూసెక్కులైతే .. కుడి కాలువ సామర్థ్యం 24,606 క్యూసెక్కులుగా ఉందని వివరించారు. 510 అడుగుల వద్ద రెండు కాలువల సామర్థ్యం సమానంగా ఉండాలని, నీటి విడుదల సామర్థ్యాల్లో తేడాలను సరిదిద్దాలని కోరారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాల్లో ఈ అసమానతను సరిదిద్దాలని, సామర్థ్యం సమానంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఇతర మార్గాల ద్వారా సాగు నీటి సరఫరాకు అవకాశం ఉందని, కృష్ణా న‌ది నీటిని బేసిన్‌లో ఉన్న తెలంగాణకు వదిలేసే విధంగా ఏపీకి ఆదేశాలు జారీ చేయాలని ఈఎన్సీ లేఖలో ప్రస్తావించారు.



Next Story

Most Viewed