’అందులో రిజిస్ట‌ర్ చేసుకుంటేనే టీకా‘

by  |
’అందులో రిజిస్ట‌ర్ చేసుకుంటేనే టీకా‘
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలకు అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడనే విషయంపై ఇప్పటివరకూ నెలకొన్న ఆందోళనకు కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టింది. పది రోజుల్లో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన 10 రోజుల్లో టీకాలను ప్రజలకు ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. కొవిడ్ వ్యాక్సినేష‌న్‌కు సిద్ధంగా ఉన్నామ‌ని వచ్చే గురు, శుక్ర‌వారాల్లో 1,200 కేంద్రాల్లో డ్రై ర‌న్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. కొ-విన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న వారికే టీకా వేస్తామ‌ని పేర్కొన్నారు. అంతేగాకుండా వారానికి నాలుగు రోజులు కొవిడ్ టీకాల పంపిణీ చేపడుతామ‌న్నారు. బుధ‌, శ‌నివారాల్లో మిగిలిన టీకాల పంపిణీ ఉంటుంద‌న్నారు. వంద‌కు పైగా ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో టీకా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ప‌ది రోజుల్లో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు.



Next Story

Most Viewed