సాగర్ సరిహద్దుల్లో ఆంక్షలు

77

దిశ, నాగార్జునసాగర్ : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తెలుగు రాష్ట్రాల రాక పోకలపై పడింది.  ఏపీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 6గంటల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చి, మిగతా వాటిని వెనక్కి పంపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు పంచుకుంటున్న నాగార్జునసాగర్‌ నుంచి మాచర్ల సరిహద్దులను ప్రస్తుతం మూసి వేశారు. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్లే ప్రజలు, వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో లేని లాక్‌డౌన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏమిటంటూ ప్రజలు పోలీసులను నిలదీస్తున్నారు.

ఏపీ సరిహద్దు వైపు తనిఖీలు

నాగార్జునసాగర్  కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ చేసిన పోలీసులు రాష్ట్ర సరిహద్దు అవతలి వైపున ఉన్న ఏపీలోని గుంటూరు జిల్లా సాగర్ విజయపురి సౌత్ గల చెక్‌పోస్ట్‌ వద్ద అక్కడి పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. తొలుత అత్యవసర వాహనాలు అనుమతించమని అధికారులు ప్రకటించారు. సరిహద్దు మూసివేయటంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వేలాది మంది ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సాగర్ సరిహద్దు వద్దకు చేరుకొని ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..