బిగ్‌ బ్రేకింగ్ : తొలి విడతలో 50 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ఆదేశాలు

by  |
CM KCR Yadadri Tour
X

దిశ, తెలంగాణ బ్యూరో : అన్ని శాఖల్లో త్వరితగతిన 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణాలో తొలివిడత భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. నూతన జోన్ల విధానానికి అన్ని అడ్డంగులు తొలగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తంగా ఉందని, స్థానికులకు న్యాయం చేసేందుకే కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం జోన్ల వ్యవస్థకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉద్యోగ ఖాళీల సమాచారం కేబినెట్‌కు అధికారులు తీసుకురావాలని సీఎం సూచించారు. ఇదిలాఉండగా, ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడంతో ఇన్నిరోజులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసిన నిరుద్యోగుల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్​ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.

ఈ నెల 13న కేబినెట్​ భేటీ..

ఈ నెల 13వ తేదీన రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుందని ప్రగతి భవన్​ వర్గాలు ప్రకటించాయి. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్ష‌త‌న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుందని, రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, వ్య‌వ‌సాయం, ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తితో పాటు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించ‌నున్నట్లు ప్రకటించారు.

Next Story

Most Viewed