వర్షాకాలంలో…వాడీ వేడిగా….

by  |
వర్షాకాలంలో…వాడీ వేడిగా….
X

దిశ వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్దమైంది. సోమవారం నుంచి సమావేశాలు షురూ కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు చేశారు. ఉభయ సభల్లోనూ సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించే విధంగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం శాసన సభ, మండలిలో అదనపు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కరోనా నెగెటివ్ వచ్చిన వారినే మాత్రమే అసెంబ్లీలోకి అనుమతించనున్నారు.

ఇక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, విపక్షాలు ఇప్పటికే ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. ఈ సారి వర్షాకాల సమావేశాల్లో పలు అంశాలపై వాడి వేడి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా కట్టడిలో సర్కార్ విఫలం, సెక్రటేరియట్ కూల్చివేత, ఉస్మానియా ఆస్పత్రి వంటి అంశాల్లో పలు అంశాలపై సభలో టీఆర్ఎస్‌ను నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. కాగా విపక్షాలు ధీటుగా ఎదుర్కొనుందేకు అధికార టీఆర్ఎస్ కూడా సిద్దమవుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed