ఇండియాలో 2 లక్షల ‘ఎక్స్’ ఖాతాలపై నిషేధం

by Disha Web Desk 17 |
ఇండియాలో 2 లక్షల ‘ఎక్స్’ ఖాతాలపై నిషేధం
X

దిశ, టెక్నాలజీ: సోషల్ మీడియా దిగ్గజం X (గతంలో ట్విట్టర్) భారీ సంఖ్యలో ఖాతాలను నిషేధించినట్టుగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య దాదాపు 2,12,627 ఖాతాలు నిషేధించినట్లుగా తాజాగా ప్రకటించింది. ఎక్కువ ఖాతాలను పిల్లల లైంగిక దోపిడీ, నగ్నత్వాన్ని ప్రోత్సహించిన కారణంగా తొలగించారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు 1,235 ఖాతాలను, ద్వేషపూరిత ప్రవర్తనకు సంబంధించి 412, సున్నితమైన పెద్దల కంటెంట్ 953, దుర్వినియోగం/వేధింపులు 359, వేధింపులు 3,074 ఖాతాలను నిషేధించింది.

వినియోగదారుల నుండి 5,158 ఫిర్యాదులను రాగా, ఖాతా సస్పెన్షన్‌లను అప్పీల్ చేసుకున్న 86 ఫిర్యాదులను ప్రాసెస్ చేసింది. ఖాతాలను సమీక్షించిన తర్వాత వీటిలో 7 ఖాతా సస్పెన్షన్‌లను రద్దు చేశారు. మిగిలిన ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇంతకుముందు జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 మధ్య, ఎక్స్‌ ఇండియాలో 5,06,173 ఖాతాలను నిషేధించింది. IT రూల్స్, 2021కి అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌పై వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలను ప్రతినెలా విడుదల చేస్తాయి. అందులో భాగంగా ఎక్స్ తన నివేదికను విడుదల చేసింది.

Next Story

Most Viewed