మీ ఫోన్ కాల్స్‌ను ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా.. అయితే ఇలా తెలుసుకోండి!

by Disha Web Desk 17 |
మీ ఫోన్ కాల్స్‌ను ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా.. అయితే ఇలా తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇంటర్నెట్ మూలంగా మానవుని జీవితాలు ఎంతగానో ప్రభావితం అవుతున్నాయి. ఏ చిన్న పని పూర్తి కావాలన్న సులభంగా, క్షణాల్లో పూర్తయ్యే అధునాతన సాంకేతికలు మన వద్ద ఉన్నాయి. కానీ అలాంటి టెక్నాలజీ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, నష్టాలు కూడా ఉన్నాయి. ఇటీవల గోప్యత అనేది చాలా తగ్గిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కారణంగా కొంత వరకు గోప్యతకు భంగం వాటిల్లుతుంది. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నా లేదా చాట్ చేస్తున్నా దానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను మన వరకే ఉంచుకుంటాం.

కానీ ఇటీవల కొత్తగా వస్తున్న యాప్స్, వివిధ రకాల స్పై ఫైల్స్ మన వ్యక్తిగత విషయాలను బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాయి. అనుమతి లేకుండా కాల్స్ రికార్డింగ్ చేయడం, చాట్ హిస్టరీని దొంగలించడం అనేవి సాధారణంగా జరుగుతున్న పరిణామాలు. అందుకే ఫోన్లో మాట్లాడుకున్న మాటలు, మెసేజ్‌లను ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.

ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అవతలి వారు మీ కాల్‌ను రికార్డింగ్ చేస్తున్నారా..? లేదా..? అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలను నిపుణులు అందిస్తున్నారు. కాల్ వచ్చినా లేదా ఎవరికైనా కాల్ చేసినా, కొన్ని సెకన్లు లేదా నిమిషాల తర్వాత మొబైల్ ఫోన్లో బీప్ సౌండ్ వినిపిస్తోంది. అలాంటి టైంలో కాల్‌ను రికార్డ్ చేస్తున్నారని అర్థం. యాప్ ద్వారా రికార్డ్ చేస్తే, యాప్ నుంచి ప్రత్యేకమైన సౌండ్ ఒకటి వస్తుంది. దానిని మీరు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.

హ్యాకింగ్ గురైన ఫోన్లు కాలింగ్ సమయాల్లో చాలా వేడి అయ్యే అవకాశం ఉంది. డిస్‌ప్లే పైన మైక్ ప్యానెల్ అనవసరంగా కనిపిస్తే కాల్స్ రికార్డ్ అవుతున్నాయని గుర్తించాలి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లయితే, ఫోన్‌ను వెంటనే రీస్టార్ట్ చేసి పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, అనుమతి లేకుండా కాల్స్‌ను రికార్డ్ చేసినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


Next Story

Most Viewed