మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చిన WhatsApp

by Disha Web Desk 17 |
మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చిన WhatsApp
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. డెస్క్‌టాప్‌లో వాట్సాప్ యాప్ ఉపయోగించేవారి కోసం గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్‌ను మరింత మెరుగ్గా అందించడానికి కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. కొత్త ఫీచర్‌లో గ్రూప్ కాల్స్‌కు మరింత ఎక్కువ మంది యూజర్లను యాడ్ చేయవచ్చు. WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో ఎనిమిది మంది వ్యక్తులతో గ్రూప్ వీడియో కాల్‌లను, 32 మంది వ్యక్తులతో ఆడియో కాల్‌లను చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సహోద్యోగులతో కనెక్ట్ కావడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. యాప్‌ను వినియోగదారులు స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ యాప్ ఆడియో కాల్స్, వీడియో కాల్స్ ఎండ్-టు- ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను చేయబడుతాయని, అలాగే త్వరలో మరిన్ని కొత్త అప్‌డేట్‌లను కూడా అందిస్తామని మెటా యాజామాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

Read more:

WhatsApp నుంచి అదిరే ఫీచర్: ఫోన్ ఆఫ్‌లో ఉన్న కూడా వాట్సాప్ చాట్‌లు వర్కింగ్

Next Story

Most Viewed