సోషల్ మీడియాకు అడెక్ట్ అయ్యారా.. ఇలా బయటపడండి!

by Disha Web Desk 8 |
సోషల్ మీడియాకు అడెక్ట్ అయ్యారా.. ఇలా బయటపడండి!
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. దీంతో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు.ఇక ప్రస్తుతం యూత్ ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సాప్ , ట్విట్టర్‌కు చాలా అడెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే ఫ్యామిలీ లేకుండానైనా ఉండగలం కానీ, సోషల్ మీడియాలేకుండా ఉండలేం అనేంతగా మారిపోయారు.

వారికి బాధ వచ్చినా స్టోరీలో చెప్పుకోవడం, సంతోషం వచ్చినా చాటింగ్ ద్వారా ఫ్రెండ్స్‌తో పంచుకోవడం చేస్తున్నారు తప్పా.. ఏదీ బయటకు చెప్పడం లేదు కన్నతల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లలతో కరెక్ట్‌గా మాట్లాడటం లేదు.

వీటికి బానిసైనవారు మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానసిక ప్రశాంతత లేకపోవడంతో, అది వారి ఆరోగ్యం ప్రభావం చూపుతుందంట. వీటికి బాగా అలవాటైనవారు కొందరు, ఆ ఊబి నుంచి బయటపడలేక సూసైడ్‌కు ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే? సోషల్ మీడియా ప్రభావం వీరిపై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.అందువలన ఈ సోషల్ మీడియా వ్యసనాన్ని వదిలించుకోవాలంట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

ఫ్యామిలీతో గడపడానికి ఆసక్తిచూపాలంట, రోజులో ఒక గంట కంటే తక్కువ సోషల్ మీడియాకు ఉపయోగించాలి.

  • రాత్రి సమయంలో సెల్ ఫోన్‌ను అస్సలే వాడకూడదు.

  • ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి.

  • ఒంటరిగా కాకుండా స్నేహితులతో కలిసి ఏంజాయ్ చేయాలి, కబుర్లు చెప్పుకోవాలంట.

  • వీలైతే ఫోన్లో ఉన్న యాప్స్ అన్నింటినీ అన్ ఇన్ స్టాల్ చేయాలి దీని ద్వారా కొంత సోషల్ మీడియా అడిక్షన్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


Next Story

Most Viewed