10 ఏండ్ల క్రితం కుప్పకూలిన విమానం.. సముద్రంలో పేలుళ్లతో గుర్తించనున్నారా..

by Sumithra |
10 ఏండ్ల క్రితం కుప్పకూలిన విమానం.. సముద్రంలో పేలుళ్లతో గుర్తించనున్నారా..
X

దిశ, ఫీచర్స్ : కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం MH370 ఎక్కడ అదృశ్యమైందనే దాని పై ప్రముఖ పండితులు దశాబ్ద కాలంగా ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఛేదించడంలో ఎవరూ సక్సెస్ కాలేదు. ఇంతలో తప్పిపోయిన విమానాన్ని కనుగొనడానికి పరిశోధకులు కొత్త మార్గాన్నివెతుకుతున్నారు.

విమానం MH370 అదృశ్యం కేసు ఏమిటి ?

MH370 విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్ 12:41 గంటలకు కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం విమానం MH370 ఉదయం 6:30 గంటలకు చేరుకోవాలి. అయితే విమానం టేకాఫ్ అయిన గంటలోపే రాడార్ నుంచి మిస్టరీగా మాయమైంది. పైలట్ ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ పంపకపోవడంతో విమానంలో ఎలాంటి అలజడి జరగలేదని, హైజాక్ జరగలేదని చెప్పొచ్చు.

విమానం అదృశ్యమైన వెంటనే, మలేషియా సైనిక, పౌర రాడార్‌ల ద్వారా విమానాన్ని ట్రాక్ చేయడం ప్రారంభించింది. విమానం అండమాన్ సముద్రం మీదుగా పశ్చిమం నుంచి ఉత్తరం వైపు తిరిగిందని వెల్లడించారు. కొన్ని రోజుల తర్వాత, మలేషియా అధికారులు విడుదల చేసిన ట్రాకింగ్ డేటా ఆస్ట్రేలియాకు నైరుతి దిశలో హిందూ మహాసముద్రంలో విమానం కూలిపోయిందని స్పష్టం చేసింది. అప్పటి నుండి విమానం కోసం అన్వేషణలో అనేక కార్యకలాపాలు ప్రారంభించారు. కానీ పెద్దగా సమాచారం ఏం అందలేదు.

సముద్రగర్భంలో జరిగే పేలుడు ఫ్లైట్ MH370ని ఎలా గుర్తిస్తుంది ?

నీటి అడుగున పేలుళ్లను నిర్వహించడం ద్వారా క్రాష్ జరిగిన ఖచ్చితమైన స్థలాన్ని గుర్తించవచ్చని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు భావిస్తున్నారు. వాస్తవానికి, ఒక విమానం సముద్రపు నీటిని ఢీకొన్నప్పుడు, నీటిలో 3 వేల కిలోమీటర్ల దూరం వరకు నమోదు చేయగల ప్రత్యేక రకమైన ధ్వని సంకేతం ఉత్పత్తి అవుతుంది. వారి రికార్డింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 హైడ్రో-ఎకౌస్టిక్ స్టేషన్ల ద్వారా జరుగుతుంది.

కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకుడు ఉసామా ఖాద్రీ మాట్లాడుతూ 'ఫ్లైట్ MH370 7వ ఆర్క్ సమీపంలో క్రాష్ అయి ఉండాలి. ఎందుకంటే విమానంతో చివరి సంకేతాలు అక్కడ రికార్డ్ అయ్యింది. ఈ ప్రదేశం ఆస్ట్రేలియాకు దక్షిణాన ఉన్న హైడ్రో-ఎకౌస్టిక్ స్టేషన్ నుండి దాదాపు 2,000 కి.మీ. ఈ ప్రదేశంలో ఉంది. నియంత్రిత పేలుడు జరిగితే దాని ఆధారంగా అందిన సమాచారం ద్వారా MH370 విమానం ఖచ్చితమైన స్థానాన్ని నిర్ధారించవచ్చు.

ఈ పద్ధతి ఎప్పుడైనా విజయవంతమైందా ?

కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకుడు ఉసామా ఖాద్రీ ఈ ప్రయోగానికి మద్దతుగా అర్జెంటీనా జలాంతర్గామి తప్పిపోయిన ఉదాహరణను తెలిపారు. 2017 లో అర్జెంటీనాలో తప్పిపోయిన ARA శాన్ జువాన్ జలాంతర్గామి రెస్క్యూ మిషన్ కోసం ఇదే విధమైన ప్రయత్నం జరిగి విజయవంతమైంది. అందుకే MH370 విషయంలో ఇదే విధమైన ప్రయత్నం జరిగితే, దశాబ్దం తర్వాత విమానం కోసం అన్వేషణ పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు.

అదే సంవత్సరంలో, ఓషన్ ఇన్ఫినిటీ అనే అమెరికన్ ప్రైవేట్ కంపెనీ కూడా తప్పిపోయిన విమానం కోసం వెతకడానికి ప్రభుత్వానికి ఆఫర్ చేసింది. ఓషన్ ఇన్ఫినిటీ ఒక అమెరికన్ మెరైన్ రోబోటిక్స్ కంపెనీ. విమాన ప్రమాదానికి సంబంధించి కొన్ని కొత్త ఆధారాలు దొరికాయని కంపెనీ పేర్కొంది. ఆధారాలు నమ్మదగినవిగా తేలితే, మలేషియా ప్రభుత్వం తదుపరి విచారణకు వారిని అనుమతిస్తుంది.

Next Story