తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారి కోసం మార్కెట్లోకి కొత్త మోడల్

by Disha Web Desk 17 |
తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారి కోసం మార్కెట్లోకి కొత్త మోడల్
X

దిశ, వెబ్‌డెస్క్: Tecno కంపెనీ ఇండియాలో కొత్తగా స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు 'Tecno Spark Go 2023'. ఇది 4G స్మార్ట్‌ఫోన్. 3GB RAM, 32GB మెమరీ ధర రూ. 6999. స్మార్ట్‌ఫోన్‌ నెబ్యులా పర్పుల్, ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్‌ను, టచ్ సాంప్లింగ్ రేటు 120Hz వరకు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12పై ఆధారపడిన HiOS 12.0 ఆధారంగా పనిచేస్తుంది.


స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 13MP ప్రైమరీ సెన్సార్, సెకండరీ AI లెన్స్‌ను అమర్చారు. ముందు వాటర్ డ్రాప్ డిస్ప్లేలో సెల్ఫీల కోసం 5MP కెమెరా ఉంది. నీటి నిరోధకత IPX2 రేటింగ్ చేయబడింది. ఫోన్ బ్యాటరీ 5000mAh. ఇది 32 రోజుల వరకు స్టాండ్‌బైని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టైప్ C 10W చార్జర్‌‌ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, ఇ-కంపాస్ మొదలైన సెన్సార్‌‌లు ఉన్నాయి.Next Story